బ్రహ్మోత్సవం బైక్ కాపీనా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న బ్రహ్మోత్సవం చిత్రాన్ని మే 20న రిలీజ్ చేయనున్నారు. అయితే...బ్రహ్మోత్సవం కొత్త పోస్టర్ ను ఇటీవల రిలీజ్ చేసారు. ఇందులో మహేష్ డిఫరెంట్ గా ఉన్న మూడు చక్రాల బైక్ పై కనిపించారు. ఈ బైక్ చాలా డిఫరెంట్ గా ఉంది అదిరింది అన్నారు.
అయితే...ఈ డిఫరెంట్ బైక్ ఐడియా సొంత ఐడియా కాదని తెలిసింది. ఎలా అంటే... రాజస్ధాన్ లో టూరిజం వారు తమ ప్రమోషన్స్ లో భాగంగా డిఫరెంట్ గా ఉండే ఈ మూడు చక్రాల వాహనంతో యాడ్స్ చేసారు. ఆ బైక్ స్పూర్తితోనే అనకుంట బ్రహ్మోత్సవంలో మహేష్ బైక్ డిజైన్ చేసారు. ఈ విషయం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. అయినా..కాపీ కొట్టడం అనేది ఈరోజుల్లో..కామన్ అయిపోయింది. స్టోరీలే కాపీ కొట్టేస్తున్నారు. అందులో పోస్టర్ కోసం బైక్ డిజైన్ కాపీ కొట్టడం పెద్ద తప్పేం కాదనేది కొంత మంది వాదన. మరి...ఈ విషయం గురించి బ్రహ్మోత్సవం టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments