'బ్రహ్మోత్సవం' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ 'బ్రహ్మోత్సవం'. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం మే 7న హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్, ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, తోట తరణి, రత్నవేలు, రావు రమేష్, నమ్రత శిరోద్కర్, సితార, గౌతమ్, సీనియర్ నరేష్, వంశీ పైడిపల్లి, మిక్కి జె.మేయర్, పరుచూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఆడియో సీడీలను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ ను సత్యరాజ్, జయసుధ, రేవతి, కాజల్, సమంతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా....

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ 'నిర్మాత పివిపిగారితో చాలా కాలంగా పరిచయం. మంచి టెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను చాలా నేచురల్ గా తీశారు. ఇప్పుడు మహేష్ తో మరో మూవీ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ అల్రెడి చూశాను. మహేష్ బాబు అన్నీ సినిమాల కంటే ఇంకా ఇందులో అందంగా కనపడ్డాడు. మిక్కి మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది. శ్రీమంతుడు రికార్డ్స్ ను బ్రహ్మోత్సవం తిరగరాయాలి. నిర్మాతలకు బాగా డబ్బులు రావాలి. యూనిట్ సభ్యులందరికీ అభినందనలు'' అన్నారు.

మహేష్ బాబు మాట్లాడుతూ 'మొదటిసారి నా సినిమా ఆడియో వేడుకకి నా పాప సితార రావడం హ్యపీగా అనిపించింది. బ్రహ్మోత్సవం సినిమాలో సత్యరాజ్ గారు, జయసుధగారు, రేవతిగారు ఇలా చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం హ్యపీ, వారి నుండి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. కాజల్, సమంతతో ఇది వరకే పనిచేశాను. మళ్లీ వారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. తోటతరణిగారు నాకు ఎప్పటి నుండో తెలుసు. అర్జున్ సినిమాలో ఆయన వేసిన మధుర మీనాక్షి సెట్ ను ఇంకా మరచిపోలేదు. ఈ సినిమాలో కూడా అద్భుతమైన సెట్స్ వేశారు. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మరోసారి ప్రతి సీన్ ను చాలా గ్రాండ్ గా చూపించాడు. మిక్కి అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించాడు. నా కెరీర్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సాంగ్స్ బెస్ట్. వాటి కంటే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో టైటిల్ ట్రాక్ నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ అవుతుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. కన్విక్షన్, డేడికేషన్ ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో నేనిది వరకు చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చాలా నేచురల్ గా ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవం సినిమాతో మరింత మంచి హ్యుమన్ బీయింగ్ గా ఎదిగాను. పివిపిగారు ప్రతి సాంగ్ ఎలా వచ్చిందంటూ అడుగుతూ ప్రతిరోజు సినిమా సంగతులను చిన్నపిల్లాడిలా తెలుసుకునేవారు. మంచి ఫ్యాషనబుల్ ప్రొడ్యూసర్. ఆయన బ్రహ్మోత్సవం వంటి సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. మే 20న బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఇది మనందరికీ పెద్ద పండగలా ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ 'ఎక్కువ మంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాననే కానీ మనసులో చిన్న బెరుకు ఉండేది. అయితే మహేష్ బాబుగారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లగలిగాను. ఆయన ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఆయనతో కలిసి వర్క్ చేయడం రెండోసారి నా శక్తి మేర అవకాశాన్ని వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా టైటిల్ పెట్టేటప్పుడు తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాలను ఊహించుకుని అంత వినయంగా ఉండాలనుకుని సినిమా చేశాను. కొన్ని విలువలతో రాసుకున్న కథ ఇది. తోట తరణిగారికి, రత్నవేలు సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్'' అన్నారు.

ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ 'ఈ ఉత్సవం మన అందరికీ ఇష్టమైనది'' అన్నారు.

మిక్కి జె మేయర్ మాట్లాడుతూ 'ఈ సినిమా మ్యూజిక్ కోసం చాలా కష్టపడ్డాం. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సీతారామశాస్త్రిగారు, కృష్ణచైతన్య మంచి లిరిక్స్ అందించారు. మహేష్ తో రెండోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 'మ్యూజిక్ మంచి ఫీస్ట్ లా ఉంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్. శ్రీకాంత్ అడ్డాలగారు తన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మల్టీస్టారర్ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ చేశారు. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలే చేయాలని గీత గీసుకుంటే మహేష్ బాబు దాన్ని దాటి వచ్చి మరో గీత గీస్తారు. యూనిట్ కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.

సమంత మాట్లాడుతూ 'చిన్న చిన్న ఉత్సవాలు కలిపితేనే బ్రహ్మోత్సవం. మహేష్ బాబుగారితో మూడోసారి చేస్తున్న సినిమా ఇది. వాటన్నింటికంటే పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.

సత్యరాజ్ మాట్లాడుతూ 'మహేష్ బాబుతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్నీ ఎలిమెంట్ ఉన్న సినిమా ఇది'' అన్నారు.

కాజల్ మాట్లాడుతూ 'అమేజింగ్ టీంతో కలిసి వర్క్ చేశాను. బ్యూటీఫుల్ జర్నీ'' అన్నారు.

జయసుధ మాట్లాడుతూ 'బ్యూటీఫుల్ ఎక్స్ పీరియెన్స్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నేను చేస్తున్న మూడో సినిమా. క్లైమాక్స్ సీన్ లో మహేష్ నటన చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నటీనటులు, టెక్సిషియన్స్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.

రేవతి మాట్లాడుతూ 'సినిమా టైటిల్ లాగానే సినిమా షూటింగ్ ఉత్సవంలా సాగింది. ఈ బ్రహ్మోత్సవంలో ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి'' అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ 'బ్రహ్మోత్సవం సమయంలో తిరుమల వెంకటేశ్వరుని హుండీలో ఎలాగైతే కానుకలు పడతాయో, అలాగే ఈ సినిమా కలెక్షన్స్ సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

More News

మే 8 న సాయి ధరమ్ తేజ్ - అనిల్ రావిపూడి ల సుప్రీమ్ సక్సెస్ మీట్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా,బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా,'పటాస్ 'సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన చిత్రం 'సుప్రీమ్'.

బ్రిటిష్ ప్లారమెంట్ లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు 'డైలాగ్ బుక్' ఆవిష్కరణ

నటుడిగా డా.మోహన్ బాబు నవంబర్ 22, 2015 నాటికి 40 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంబరాల్లో చాలా కార్యక్రమాలను ప్రకటించారు.

శ్రీవారి సేవలో సుప్రీమ్ టీమ్..

సాయిధ రమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సుప్రీమ్.

హీరో సందీప్ కోసం కేక్ ఫేషియ‌ల్ త‌యారు చేసిన హీరోయిన్..

ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, రోటీన్ ల‌వ్ స్టోరి,  బీరువా, టైగ‌ర్..త‌దిత‌ర చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఈరోజు సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు.

శర్వానంద్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ భారీ చిత్రం

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భా