బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్నితెలుగు, తమిళ్ భాషల్లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించిన బ్రహ్మోత్సవం ఆడియోను మే 1న తిరుపతిలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అయితే...కొన్ని కారణాల వలన బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ కార్యక్రమం వాయిదా వేసినట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం ఆడియోను మే 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆడియో రిలీజ్ లేటెస్ట్ డేట్ మరో రెండు రోజుల్లో ఎనౌన్స్ చేస్తారట. అయితే ముందుగా అనుకున్నట్టు ఆడియో వేడుకను తిరుపతిలో కాకుండా హైదరాబాద్ లో చేయాలనుకుంటున్నారట. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగే ఈ ఆడియో వేడుకకు కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments