బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ వాయిదా..

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్నితెలుగు, త‌మిళ్ భాష‌ల్లో పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మిక్కి జే మేయ‌ర్ సంగీతాన్ని అందించిన బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను మే 1న తిరుప‌తిలో గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అయితే...కొన్ని కార‌ణాల వ‌ల‌న బ్ర‌హ్మోత్స‌వం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం వాయిదా వేసిన‌ట్టు సమాచారం.

తాజా స‌మాచారం ప్ర‌కారం బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను మే 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఆడియో రిలీజ్ లేటెస్ట్ డేట్ మ‌రో రెండు రోజుల్లో ఎనౌన్స్ చేస్తార‌ట‌. అయితే ముందుగా అనుకున్న‌ట్టు ఆడియో వేడుక‌ను తిరుప‌తిలో కాకుండా హైద‌రాబాద్ లో చేయాల‌నుకుంటున్నార‌ట‌. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగే ఈ ఆడియో వేడుక‌కు కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతున్న‌ట్టు స‌మాచారం.

More News

అన్న‌య్య - త‌మ్ముడు ఒకేసారి..

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి - త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్....వీళ్లిద్ద‌రు ఒకేరోజు త‌మ చిత్రాల‌ను ప్రారంభిస్తున్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈ నెల 29న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్నయువ జంట‌..

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్న యువ జంట‌..ఎవ‌రో కాదు నాగ చైత‌న్య - స‌మంత‌. వీరిద్ద‌రు తొలిసారి ఏమాయ చేసావే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆత‌ర్వాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో  న‌టించారు. తాజాగా నాలుగోసారి చైత‌న్య - స‌మంత క‌లిసి న‌టిస్తున్నారు.

'కబాలి' టీజర్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ.

బోయపాటి నెక్ట్స్ జోనర్ ఏంటంటే

బోయపాటి శ్రీను ప్రస్తుతం సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి.

నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను

భద్ర,తులసి,సింహ,దమ్ము,లెజెండ్...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.