Nagarjuna : 1000 నందుల బలాన్ని గుప్పిట పట్టి.. ‘‘బ్రహ్మాస్త్ర’’లో ఇంట్రెస్టింగ్గా నాగ్ రోల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ కారణంగా దక్షిణాది నటులు బాలీవుడ్లో.. హిందీ నటులు సౌత్‌లో సినిమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్, తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బిగ్‌బీ అమితాబ్ , దీపికా పదుకొణే నటిస్తున్నారు. అలాగే చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వీరికి భిన్నంగా బాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు కింగ్ నాగార్జున. అదే బ్రహ్మస్త్ర.
బాలీవుడ్ నవదంపతులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. భారీ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్రను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించింది.
ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్‌లు కీలక పాత్రలు పోషించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నాగార్జున పాత్రకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో అజయ్ విశిష్ఠ్ అనే పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. 'సహస్ర నందిమ్ సామర్థ్యం.. హే నంది అస్త్రం.. ఖండ ఖండ ఖురు.. మామ్ సహాయకం, మామ్ సహాయకం' అంటూ ట్వీట్ చేశారు. 1000 నందులతో కూడిన బలం నంది అస్త్రం. ఈ శక్తిని నాగార్జున చూపిస్తున్నట్లు మోషన్ పోస్టర్ వదిలారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్ర బృందం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments