బాలయ్య బర్త్ డేపై బ్రాహ్మణి ఎమోషనల్ మెసేజ్..
- IndiaGlitz, [Tuesday,June 09 2020]
టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 10న పుట్టిన రోజు. ఈ పదో తారీఖుతో బాలయ్య 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అనుచరులు ఈ వేడుకను గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే సోషల్ మీడియాలో బాలయ్య బర్త్ డేకు సంబంధించి డీపీ, మెసేజ్‌లు, వీడియోలో మార్మోగుతోంది. ఈ సందర్భంగా బాలయ్య పెద్ద కుమార్తె, నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి స్పందించారు. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియా ద్వారా వీడియోను పంచుకున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? ఆమె ఎందుకలా ఎమోషన్ అయ్యారు..? అనే విషయాలు తెలుసుకుందాం.
ఎమోషనల్ మెసేజ్ సారాంశం ఇదీ..
‘నాన్నగారి అభిమానులందరికీ నమస్కారం.. మీ అందరికీ ధన్యవాదాలు. నాన్నగారి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఎన్నో పోస్టులు పెడుతున్నారు. నాన్నగారి వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా ఆసక్తికర పోస్టులు, హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ సేవా కార్యక్రమాలను చేపడుతుండటం నిజంగా ప్రశంసనీయం. నాన్నగారి జన్మదిన వేడుకలను అభిమానులంతా వారి కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీనివల్ల మీరు, మీ చుట్టూ ఉన్నవారు అందరూ సేఫ్‌గా ఉంటారు. మీరంతా ఎప్పుడూ మా కుటుంబసభ్యుల వంటి వారే. నాన్నగారికి ఎలాంటి క్రమశిక్షణ ఉందో... మీకు కూడా అలాంటి క్రమశిక్షణే ఉండటం సంతోషకరం. మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. మీ బ్రాహ్మణి’ అంటూ బ్రహ్మణి ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోకు స్పందించిన అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.