కొత్త గా బ్రహ్మానందం తనయుడు గౌతమ్

  • IndiaGlitz, [Wednesday,March 02 2022]

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందతున్న సినిమా గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి ప్రోడక్షన్ నెం 10 గా నిర్మిస్తున్న ఈ సినిమా తో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఒక బ్లాంక్ స్క్రీన్ పై వాయిస్ మొదలవతుంది ‘‘ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా’’ అనే డైలాగ్ తో గౌతమ్ లుక్ రిలీవ్ అవుతుంది. ఈ డైలాగ్ లో గౌతమ్ క్యారెక్టర్ లోని పెయిన్ తెలుస్తుంది. అలాగే లుక్స్ కూడా రచయిత క్యారెక్టర్ ని ఫరెఫెక్ట్ గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి.

ఆర్టిస్ట్ గా మనుతో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈ సారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతున్నాడు. మోనోఫోబియాతో బాధపడుతున్న రచయితగా కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది..? తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడు అనేది థ్రిలింగ్ ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ కాన్సెప్ట్ ని యునిక్ గా తెరకెక్కిచడంలో సుబ్బు చెరుకూరి తన దైన ముద్రను వేసాడని చిత్ర యూనిట్ అంటుంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్ జరుపుకుంటుంది.

ఎమ్ యస్ జోన్స్ రూపెర్ట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత సృజన్ యరబోలు, దర్శకత్వం సుబ్బు చెరుకూరి.

More News

రష్యా- ఉక్రెయిన్ వార్: భారతీయుల ఇబ్బందులపై హీరో రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి వెళ్లిన భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

టీడీపీ పెద్దాయనకు అశ్రు నివాళి.. యడ్లపాటి పాడె మోసిన చంద్రబాబు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంక్రటావు అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

మా వాడి జాతకానికి ముహూర్తం కుదరడం లేదు .. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ వాయిదా

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది',

పెండింగ్ చలాన్ల క్లియరెన్స్: పోటెత్తిన జనం.. సర్వర్ క్రాష్, తొలి రోజు ఎన్ని కోట్ల ఆదాయమంటే..?

ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రక్రియకు తెలంగాణ పోలీసులు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు.

‘‘నా ధైర్యం అణువణువునా వుంటుంది’’: రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్.. తాటతీస్తున్నాడుగా.. !!!

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన..