ఇప్పటికే కన్ఫ్యూషన్ తో చస్తున్నాం.. మళ్ళీ గొడవెందుకు: బ్రహ్మానందం
Send us your feedback to audioarticles@vaarta.com
వెండితెరకి దశాబ్దాలుగా ఏలుతున్న నవ్వుల రారాజు బ్రహ్మానందం. బ్రహ్మానందం కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. ఆయనలో భక్తుడు, చిత్రకారుడు కూడా దాగి ఉన్నారు. బ్రహ్మానందం తరచుగా దేవతల స్కెచెస్ వేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న ఓ డివోషనల్ కాంట్రవర్సీపై బ్రహ్మానందం తనదైన శైలిలో స్పందించారు.
హనుమంతుడి జన్మస్థానం ఏది ? ఈ ప్రశ్న పెద్ద వివాదానికే కారణం అయింది. ఇటీవల టిటిడి హనుమంతుడు జన్మించింది తిరుపతి ఏడుకొండల్లోని అంజనాద్రిలోనే అని ప్రకటించింది. దీనితో వివాదం చెలరేగింది. కర్ణాటకలోని కిష్కింద ట్రస్ట్ టిటిడి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆంజనేయ స్వామి జన్మస్థానం కిష్కింధ అనేది వారి వాదన. ఇరు వైపులా వాదనలు జరుగుతున్నాయి. కానీ హనుమంతుడి జన్మస్థానం ఇదే అని ఖచ్చితంగా తేల్చలేకపోతున్నారు.
దీనిపై హాస్యనటుడు బ్రహ్మానందం స్పందించారు. ఓ డిబేట్ లో పాల్గొనే అవకాశం రాగా బ్రహ్మానందం ఇలా అన్నారు. హనుమంతుడు ఎక్కడ జన్మించాడు అనేది నిర్వివాదం. ఆయన మహా భక్తుడు, భగవంతుడు. అందుకే మనం పూజిస్తున్నాం. హనుమంతుడు మన దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. అంతే కానీ ఏ ప్రాంతంలో పుట్టాడు అని ఇలా గందరగోళం సృష్టించకూడదు.
ఏదైనా పండుగ వస్తే ఈరోజు సంగం, రేపు సంగం అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఉన్న కన్యూజన్స్ తో చస్తుంటే మళ్ళీ కొత్తది ఎందుకు అని బ్రహ్మానందం అన్నారు. ఆంజనేయ స్వామి అందరి వాడు అని, దీనిపై ఇక చర్చ అనవసరం అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments