బెంగాల్ టైగర్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే..

  • IndiaGlitz, [Monday,December 07 2015]

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. సంప‌త్ నంది తెర‌కెక్కించిన బెంగాల్ టైగ‌ర్ మూవీని ఈనెల 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు బ్రహ్మానందం న‌టించారు. అయితే ఆయ‌న పాత్ర పేరు మాత్రం విచిత్రంగా ఉంది. ఖాన్ దాదా, నిక్క‌ర నారాయ‌ణ‌, అర‌గుండు, క‌త్తి రాందాసు, జిలేబి...ఇలా విభిన్న పాత్ర‌ల‌తో అల‌రించిన బ్ర‌హ్మానందం బెంగాల్ టైగ‌ర్ లో మాత్రం బాగా ఎంట‌ర్ టైన్ చేస్తాడ‌ట‌. ఇంత‌కీ ఆయ‌న క్యారెక్ట‌ర్ పేరు ఏమిటంటే...అమ‌లాపాల్ అట‌. బ్ర‌హ్మి అమ‌లాపాల్ క్యారెక్ట‌ర్ కి సంబంధించిన ఫోటోను డైరెక్ట‌ర్ సంప‌త్ నంది త‌న ఫోస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఈ ఫోటోకి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఏమిటి..బ్ర‌హ్మికి హీరోయిన్ పేరు పెట్టారేమిటి అనుకుంటున్నారా..? ఎందుకు పెట్టారో..బ్ర‌హ్మి ఎలా ఎంట‌ర్ టైన్ చేస్తాడో తెలుసుకోవాలంటే బెంగాల్ టైగ‌ర్ చూడాల్సిందే.