బాలీవుడ్‌కు బ్రహ్మానందం, సునీల్
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
టాలీవుడ్ స్టార్ కమెడియన్స్‌గా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం, సునీల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ప్రసాద్ తాటికేని దర్శకత్వంలో సన్నీలియోన్, మందాన కరిమి ముఖ్య పాత్రల్లో ఓ సినిమా రూపొందనుంది. హారర్ కామెడీ చిత్రంలో బ్రహ్మానందం, సునీల్ నటించబోతున్నారట. త్వరలోనే వీరిద్దరూ యూనిట్‌తో జాయిన్ కాబోతున్నారు. సింగిల్ షెడ్యూల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని యూనిట్ భావిస్తుందట. ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్స్ ఇప్పుడు హిందీ ప్రేక్షకులను నవ్వించడం కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.