హీరోయిన్స్ పై బ్రహ్మాజీ ఫైర్!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటులు పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు, దర్శకులు, నిర్మాణం సంస్థలు తమకు తోచినంత ఆర్థిక విరాళాలు ప్రకటించడం జరిగింది. మరోవైపు కరోనా నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ’ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వాలతో పాటు ఈ చారిటీకి కూడా పెద్దఎత్తున విరాళాలను నటులు ప్రకటిస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రభుత్వాలకు అవసరమైతే మరింత సాయం చేసేందుకు కూడా కొందరు అస్సలు వెనుకాడట్లేదు. బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకూ పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువలా వస్తున్నాయి.
ఏం స్పందించరా..!?
అయితే.. కేవలం హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు మాత్రం ముందుకొస్తుండటం.. హీరోయిన్స్ మాత్రం అస్సలు ముందుకు రాకపోవడం.. వారి నుంచి ఎలాంటి ఆర్థిక విరాళాలు రాకపోవడంతో టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీకి చిర్రెత్తుకొచ్చింది. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు ఛారిటీకి హీరోయిన్లు మద్దతివ్వరేం..? అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ‘ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదు ఎందుకనీ..?. నిజంగా ఇది చాలా బాధకర, ఆశ్చర్యకరమైన విషయం. కేవలం లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారు. మిగిలిన వారు ఎందుకు స్పందించరు..?’ అని బ్రహ్మాజీ కోప్రోదిక్తుడయ్యాడు. కాగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నటి ప్రణీత తనవంతుగా సాయం ప్రకటించిన విషయం విదితమే. మరి ముంబై నుంచి వచ్చిన భామలు ఈ కామెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments