ఇట్స్ అఫిషీయల్: బోయపాటి శ్రీను - రామ్ కాంబినేషన్ ఫిక్స్.. టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో బోయపాటి శ్రీను మంచి జోష్‌లో వున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు ఆయన కళ తీసుకొచ్చారు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో అఖండ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో బోయపాటితో సినిమా తీసేందుకు పలువురు స్టార్ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అటు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. దీంతో శ్రీను ఎవరితో కమిట్ అవుతారా అని ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఊహాగానాకు తెరదించారు బోయపాటి శ్రీను. ఏకంగా పాన్ ఇండియా సినిమా చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి చిత్రమిది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. ఆయన సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల్లో క్రేజ్ వుంది. అటు రామ్ సినిమాలకు కూడా హిందీలో మంచి మార్కెట్ ఉంది. దీనిని దృష్టిలో వుంచుకునే బోయపాటి- రామ్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న 'ది వారియర్' సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్టు శ్రీనివాసా చిట్టూరి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఒక ప్రత్యేకత వుంది. హీరోగా రామ్‌కు ఇది 20వ చిత్రమైతే.. దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు 10వ సినిమా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments