బోయపాటికి భారీ పారితోషికం?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందీ చిత్రం. రెండో షెడ్యూల్‌ను ఈ నెల 6వ తేదీ నుంచి చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొంత మందిపై యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నందుకు గాను బోయపాటి.. తన కెరీర్‌లోనే తొలిసారిగా రూ. 15 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇంతవరకు రూ. 10 కోట్లు ఉన్న ఆయన పారితోషికాన్ని ఈ సినిమా నుంచీ పెంచేశారని సమాచారం. రాజమౌళిని మినహాయిస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి దర్శకులు మాత్రమే రూ.15 కోట్ల క్లబ్‌లో ఉన్నారు. ఈ సినిమాతో బోయపాటి కూడా వారి సరసన చేరిపోయారన్నదే ఇండస్ట్రీలో వినిపిస్తున్న హాట్ టాపిక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com