బోయ‌పాటి.. ఓ ఇంటివార‌య్యారు

  • IndiaGlitz, [Friday,April 06 2018]

టాలీవుడ్  టాప్ డైరెక్టర్‌లలో బోయపాటి శ్రీను ఒకరు. కుటుంబ కథల్లో యాక్షన్‌ను మిళితం చేసి చిత్రాలను తెరకెక్కించడంలో ఈయ‌న సిద్ధ‌హ‌స్తులు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఈ దర్శకుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతేగాకుండా.. త‌న‌కు క‌లిసొచ్చిన క‌థానాయ‌కుడు బాలకృష్ణతోనూ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే.. మహేష్ బాబుతో కూడా మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సినిమాకి పది నుంచి పదిహేను కోట్ల రూపాయిల‌ దాకా పారితోషికం తీసుకునే ఈ యాక్షన్ చిత్రాల‌ డైరెక్టర్.. ఇప్ప‌టివ‌ర‌కు యూసఫ్‌గూడాలోని ఒక అపార్ట్ మెంట్‌లో రెండు ఫ్లాట్‌లను అద్దెకు తీసుకుని అందులోనే ఇల్లు, ఆఫీస్ రన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఓ సొంత‌ ఇంటి వారయ్యారట‌ బోయపాటి. ఆ వివరాల్లోకి వెళితే.. కొండాపూర్‌లో మెయిన్ రోడ్డు మీద సొంతంగా ఓ బంగ్లాను నిర్మించుకున్నారట బోయ‌పాటి. సాధారణంగా భారీ కట్టడాలు, సెట్స్‌, సాంప్ర‌దాయ‌ డిజైన్‌లంటే ఇష్టపడే బోయపాటి.. సింపుల్‌గా ఆరు కోట్ల రూపాయలతో ఈ  డ్యూప్లెక్స్‌ని కట్టుకున్నార‌ని స‌మాచారం. సింపుల్ డిజైన్‌లో కనిపించే ఈ డ్యూప్లెక్స్‌ గృహప్రవేశానికి అతి కొద్ది మంది సన్నిహితులను, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించార‌ట‌ బోయ‌పాటి.