బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని సినిమా కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత రవీందర్ రెడ్డి తనయ మిర్యాల ద్వారక, డైరెక్టర్ బోయపాటిశ్రీను తనయ బోయపాటి జోషిత క్లాప్ కొట్టారు.
బోయపాటి శ్రీను తనయుడు బోయపాటి హర్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నవంబర్ 16 నుండి హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, సాహిసురేష్ ఆర్ట్ డైరెక్షన్, యం.రత్నం డైలాగ్స్, రిషి పంజాబి సినిమాటోగ్రఫీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com