తెలుగు »
Cinema News »
నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను
నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను
Tuesday, April 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
భద్ర, తులసి, సింహ, దమ్ము, లెజెండ్...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. తాజాగా అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇటీవల రిలీజైన సరైనోడు విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా సరైనోడు సినిమా గురించి డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఇంటర్ వ్యూ మీకోసం...
సరైనోడు సినిమా గురించి మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?
నాకు వచ్చిన ఫీడ్ బ్యాక్.. సూపర్ హిట్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ దేవుడి దయ వల్ల ఇలాగే కంటిన్యూ అవుతాయనుకుంటున్నాను. టీమ్ అంతా కష్టపడి వర్క్ చేసాం. మా కష్టానికి తగ్గట్టుగా సినిమా జనాదరణ పొందడం సంతోషంగా ఉంది.
సరైనోడు సినిమాని... మీరు అనుకున్నది అనుకున్నట్టుగా తీసాను అనుకుంటున్నారా...?
నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసానండి. అందులో ఎలాంటి సందేహం లేదు. లెజెండ్ సినిమా 600 రోజులు ఆడింది ఇంకా ఆడుతూనే ఉంది. లెజెండ్ తర్వాత చేసే సినిమా అంటే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండాలనే.. సరైన సినిమా చేయడం కోసమే వెయిట్ చేసాను. అందుకే లెజెండ్ తర్వాత సరైనోడు సినిమా చేయడానికి ఇంత గ్యాప్ వచ్చింది. మీరడిగినట్టుగా... ఒకవేళ నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసే అవకాశం ఉండదు.. నేను తీయాలనుకున్న దానికి అభ్యంతరం చెబుతారు అనుకుంటే వాళ్లకి అసలు సినిమానే చేయను. నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను.
సరైనోడు ప్రమోషన్స్ లో మీరు లో ఫ్రొఫైల్ మెయిన్ టైన్ చేయడానికి కారణం..?
ఏ సినిమాకైనా నేను సినిమా రిలీజ్ ముందు మాట్లాడను. సినిమా రిలీజ్ తర్వాతే మాట్లాడతాను. అయినా లో ఫ్రొఫైల్ మెయిన్ టైన్ చేయడమే కరెక్ట్ అని ఫీలింగ్. ఎందుకంటే...ఒక యుద్దం చేసేవాడికి యుద్ధంలో గెలుస్తాను అని క్లారిటీ ఉంటే ఎక్కువ మాట్లాడకూడదు. అందుచేత గెలుస్తాను అని నాకు తెలుసు. అందుకే ఎక్కువ మాట్లాడలేదు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో అల్లు అర్జున్ కంటే ఆది క్యారెక్టర్ గురించే ఎక్కువ చెబుతూ వచ్చారు. అయితే క్లైమాక్స్ వరకు బన్ని - ఆది కి ఫైట్ పెట్టకపోవడానికి కారణం..?
హీరో - విలన్ ఈ రెండు క్యారెక్టర్స్ ని బలంగా చూపించి...ఒక్కసారి ఇద్దరికి ఫైట్ పెట్టామంటే అక్కడకి సినిమా అయిపోయినట్టే. అలాగే బలంగా ఉన్న ఈ ఇద్దరికి ఫైట్ పెట్టిన తర్వాత ఎవరు వెనకడుగు వేసినా బాగోదు. వీరిద్దరు ఎప్పుడెప్పుడు ఎదురెదురుగా పోటీపడతారా.. అనే వెయిటింగే ఈ సినిమా. అందుకనే ఇద్దరికి క్లైమాక్స్ లో ఫైట్ పెట్టాను. ఇదోరకం కొత్త స్ర్కీన్ ప్లే.
ఆది ని సి.ఎం కొడుకుగా చూపించారు కదా..? ఇంతకీ ఎవర్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసారు..?
అలాంటిది వస్తుందనే ఏ టైమ్ లో సి.ఎం గా ఉన్నాడో చూపించలేదు. అలాగే ఏ ప్రాంతానికి సంబంధించిన వాడో కూడా చెప్పలేదు. క్రిటిక్స్ కాబట్టి మీకు అలాంటి ప్రశ్నలు వస్తుంటాయి కానీ ఆడియోన్స్ అలా ఆలోచించరు. ఎవర్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయలేదు.
హీరో అల్లు అర్జున్ ఇన్ వాల్వెమెంట్ ఎంత వరకు ఉంది..?
కథ ఫైనల్ అయ్యేవరకు హీరో ఇన్ వాల్వెమెంట్ కావాలి. కథ ఫైనల్ అయి షూట్ స్టార్ట్ చేసానంటే ఇక వెనక్కి తిరిగి చూడను. నేను ఎవరి ఇన్ వాల్వెమెంట్ ని ఏక్సప్ట్ చేయనండి. ఇంతకు ముందు చెప్పినట్టుగా నేను అనుకున్నది తీయగలను అనుకున్నప్పుడే సినిమా తీస్తాను.
క్లాస్ & మాస్ మిక్స్ చేసి భద్రతో లవ్ స్టోరీ తీసారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ విధంగా లవ్ స్టోరీ తీసారనుకుంటా..?
భద్ర తర్వాత వెంకటేష్ తో తులసి సినిమా చేసాను. ఈ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియోన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొంచెం జోష్ పెంచాను. అలా పెంచడం వలన మూవీకి హైప్ వచ్చింది. ఆతర్వాత బాలయ్యబాబుతో సింహ చేసాను. ఆయనతో లవ్ స్టోరీ ఎక్కువ సేపు రన్ చేయలేం. బాలయ్యను ఎలా చూపించాలో అలా చూపించాను. తర్వాత తారక్ తో దమ్ము చేసాను. తారక్ తో ఏం చేయగలమో అది చేసాను. బన్నితో స్టైలీష్ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసాను. నేను ఏ హీరోతో అయినా సినిమా చేస్తున్నాను అంటే ఆడియోన్స్ ఆ హీరో నుంచి ఏమేమి కావాలనుకుంటారో ఆ అంశాలు ఉండేలా జాగ్రత్తగా సినిమా చేస్తాను.
భద్రలో కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి..ఈ సినిమాలో కామెడీ పార్ట్ గురించి ఏం చెబుతారు..?
నా సినిమాల్లో భద్ర తర్వాత మళ్లీ అంతలా కామెడీ బాగా పండింది అంటే అది ఈ సినిమాలోనే. బ్రహ్మానందం, విద్యులేఖ రామన్ లపై చిత్రీకరించిన కామెడీ సీన్స్ ని ఆడియోన్స్ విపరీంతగా ఎంజాయ్ చేస్తున్నారు.
బోయపాటి సినిమా అంటే ఒక ట్రెండ్ ఉంది. ఆ ట్రెండ్ మార్చి సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా..?
నేను ఒక తరహా సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలనే కొత్తగా చేయాలి. అయితే... ఖచ్చితంగా ట్రెండ్ మార్చాలి. సింహ తర్వాత లెజెండ్ తీసానంటే...సింహ రూట్ లోనే వెళ్లి కొత్తగా తీసాను. ఈ సినిమా సింహ లా ఉండదు. ఒకవేళ ఉంటే జనం చూడరు. అందుకనే ఇందులో కొత్తగా ఎమ్మెల్యే తో హీరోకి లవ్ ట్రాక్ పెట్టాను. ఈ లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉందంటున్నారు. నెక్ట్స్ మూవీకి ప్రయోగం చేయలేను. ఎందుకంటే హీరో సాయి శ్రీనివాస్ ముందు సినిమా ఫ్లాప్ అయ్యింది. అతనితో ప్రయోగం చేయలేను. మళ్లీ బన్నితో చేసే సినిమాతో ప్రయోగం చేయాలనుకుంటున్నాను.
మీ సినిమాల్లో చాలా మంది ఆర్టిస్టులతో స్ర్కీన్ నిండుగా ఉంటుంది. అలా చూపించడానికి కారణం..?
మాది ఉమ్మడి కుటుంబం. నాకు కుటుంబ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. భారతదేశం ఎంత ఎత్తుకు ఎదిగినా..టెక్నికల్ గా ఎంత అభివృద్ది సాధించానా.... అమ్మానాన్నల అనుబంధం - ప్రేమలో ఎలాంటి మార్పు రాదు. భవిష్యత్ లో ఎలా ఉంటారో తెలియదు కానీ...ఇప్పడు మాత్రం ఆ ప్రేమ అనుబంధాలను పాడు చేయకుండా ఉండాలనుకుంటాను. అది నా సినిమాల్లో చూపిస్తుంటాను. అందుకే నా సినిమాల్లో మీరన్నట్టుగా స్ర్కీన్ నిండుగా ఉంటుంది.
మీరు డైరెక్టర్ గా ఓ స్ధాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్ కమింగ్ హీరో సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నారు కదా. అయితే... కొంత మంది బోయపాటికి ఇప్పుడు అప్ కమింగ్ హీరోతో సినిమా చేయడం అవసరమా..? అని అంటున్నారు..? మీరేమంటారు..?
అవసరమా..? కాదా..? అనేది కాదండి. నాకంటూ కొంత మంది హీరోలు ఉన్నా...నేను మాట ఇచ్చాను. అందుకే చేస్తున్నాను. ఏమున్నా లేకపోయినా..మన బ్లడ్ కి ఓ నేచుర్ ఉండాలి. మనకో క్యారెక్టర్ ఉండాలి అనుకొనేవాడిని నేను. అందుచేత మాట ఇచ్చాను సినిమా తీసి ఇచ్చేస్తాను. ఆ సినిమాకి కూడా మొదటి సినిమా లాగే వర్క్ చేస్తాను.
నెక్ట్స్ చేయబోయే సినిమాకి ఎలాంటి కథ రెడీ చేస్తున్నారు..?
ఒక లైన్ అనుకున్నాను. అయితే సాయి శ్రీనివాస్ రెండో సినిమా చూడలేదు. అది అంతగా ఆడలేదు కాబట్టి ఈసారి చేసే సినిమా కొత్తగా ఉండాలి. అలాగే పెద్దగా ఉండాలి. త్వరలోనే వర్క్ స్టార్ట్ చేస్తాను.
చిరంజీవి గారితో మూవీ చేస్తున్నారా..?
చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది. ఆయనతో సినిమా చేస్తే ఎలాంటి కథ ఉండాలో అలాంటి కథ రెడీ చేయగలను. కాకపోతే చిరంజీవి గారితో సినిమా చేసే టైమ్ రావాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments