అఖిల్ సినిమా పై బోయపాటి క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో చేస్తున్న 'వినయ విధేయ రామ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అఖిల్‌తో బోయపాటి సినిమా ఉంటుందని వార్తలు వినపడ్డాయి. అయితే అందులో నిజం లేదని బోయపాటి దగ్గరి వర్గాలతో తేల్చేశాడట. ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమా చేస్తున్నానని.
అది పూర్తయిన తర్వాత బాలకృష్ణతో సినిమా చేస్తాడట బోయపాటి. ఈ సినిమా పూర్తి కాగానే ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదట. దీంతో అఖిల్ సినిమా బోయపాటితో లేదనే తెలుస్తుంది. `వినయ విధేయ రామ` వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments