అఖిల్ సినిమా పై బోయపాటి క్లారిటీ...
- IndiaGlitz, [Saturday,December 01 2018]
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో చేస్తున్న 'వినయ విధేయ రామ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అఖిల్‌తో బోయపాటి సినిమా ఉంటుందని వార్తలు వినపడ్డాయి. అయితే అందులో నిజం లేదని బోయపాటి దగ్గరి వర్గాలతో తేల్చేశాడట. ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమా చేస్తున్నానని.
అది పూర్తయిన తర్వాత బాలకృష్ణతో సినిమా చేస్తాడట బోయపాటి. ఈ సినిమా పూర్తి కాగానే ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదట. దీంతో అఖిల్ సినిమా బోయపాటితో లేదనే తెలుస్తుంది. 'వినయ విధేయ రామ' వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.