మళ్లీ మొదటికొచ్చిన బోయపాటి

ఒక హీరోతో డైరెక్టర్ సినిమా చేస్తున్నాడంటే.. అతనిపై ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయాల్సి వస్తుంది. తాజాగా బోయపాటి శ్రీనివాస్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. బాలయ్యబాబుతో సినిమా చేస్తున్న బోయపాటికి.. రూలర్ పెద్ద ఆటంకంగా మారుతుంది. డిసెంబర్‌లో విడుదలైన రూలర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. పెట్టిన పెట్టుబడిలో 25శాతం కూడా రాలేదని టాక్. ప్రతిదానికి రూలర్‌ను ఉదాహరణగా చూపుతూ.. అన్నిట్లో కోత పెడుతున్నాడట నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు ముగించుకుని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అయిన ఈ సినిమాకు.. అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. తొలుత 70 కోట్ల రూపాలయ బడ్జెట్ అనుకున్న ఈ సినిమాకు అంతపెట్టలేనని తెగేసి చెప్పాడట నిర్మాత. దీంతో కథా పరంగా కూడా బోయపాటి జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చాలని బోయపాటి అనుకున్నారట. స్క్రిప్టును మార్చి .. ఆ తర్వాతే సినిమా చేయాలనుకుంటున్నారట. బోయపాటి తాజా నిర్ణయంతో ... సినిమా కథ మళ్లీ మొదటి కొచ్చింది. ఆ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియక నందమూరి అభిమానులు గాభరా పడుతున్నారు.

More News

ఎన్నాళ్లకెన్నాళ్లకు వంగవీటి రాధా..!? రంగంలోకి దిగినట్టేనా!

వంగవీటి రాధా.. ఈ వ్యక్తి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. అయితే రాసేటప్పుడే ఒకటికి రెండుసార్లు వార్త ఆలోచించి రాయాల్సి వస్తోంది.

చిరు సలహా: రంగమ్మత్తకు షాకిచ్చిన రాములమ్మ!

ఇదేంటి.. అసలు ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించిన యాంకర్ అనసూయకు.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ షాకివ్వడమా..?

జగన్ రెక్వెస్ట్: మేనమామగా అడుగుతున్నా.. వెయ్యి ఇవ్వండి!

ప్రపంచంతో పోటిపడి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మహేశ్ బాబుకు వైఎస్ జగన్ సాయం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీరాభిమానులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

'శివ 143' మూవీ సాంగ్ లాంచ్ చేసిన జె.డి.చక్రవర్తి

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్)