బీబీ 3... బోయపాటి అలా ప్లాన్ చేస్తున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
‘సింహ, లెజెండ్’ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. ఈ సినిమాను మే 28న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్న సమయంలో షూటింగ్‌ను పూర్తి చేయడానికి బోయపాటి అండ్ టీమ్ చాలా కష్టపడుతుంది. మరో వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం యూనిట్‌ను కంగారు పెడుతుంది. ఇదంతా ఓ టెన్షన్ అయితే బోయపాటి శ్రీను మరో విషయం పరంగా టెన్షన్ పడుతున్నాడట. ఇంతకీ బోయపాటి ఎందుకు టెన్షన్పడుతున్నాడో తెలుసా..!..
బాలకృష్ణ ఇందులో అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రను చిత్రీకరించారు కూడా. అయితే చివరి నిమిషంలో ఈ పాత్ర మార్చి రాసుకోవడంతో బోయపాటి శ్రీను.. ఈ పాత్రను చూపించకుండా పోతున్నామనే టెన్షన్ పడుతున్నాడట. అందుకోసమని, ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో అఘోర పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చూపించాలని అనుకుంటున్నాడట. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments