బాలయ్య బర్త్ డే : బోయపాటి గిఫ్ట్ #BB3 అదిరింది..

  • IndiaGlitz, [Tuesday,June 09 2020]

నందమూరి బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ #BB3. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పిస్తుండగా.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా #BB3 First Roar పేరుతో ఓ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌తో కూడిన టీజ‌ర్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. చెప్పిన సమయానికే ఈ టీజర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది.

పంచెకట్టె అదరహో..

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా న‌డిచివ‌స్తున్న బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ఈ సందర్భంగా బాలయ్య వదిలిన డైలాగ్ కేక అంతే. ‘ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శ్రీ‌ను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనే దానికీ శ్రీ‌ను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా...’ అని బాలయ్య చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌, సినీ ప్రియులను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాంబోపై ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకున్న అంచనాలను కథా బలంతో పాటుగా చాలా గ్రాండియర్‌గా తెరకెక్కుతోందని చెప్పుకోవచ్చు. కాగా ఇందుకు సంబంధించిన త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఉంటాయని చిత్రబృందంలో తెలిపింది.

బాలయ్య హీరోగా వస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌
సంగీతం: థమన్‌ ఎస్‌
మాటలు: ఎం.రత్నం
ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌ ప్రకాష్‌
ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు తమ్మిరాజు
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మణ్‌
స‌మ‌ర్పణ‌: మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను

ఇప్పటికే ఈ టీజర్‌ను 87,074 మంది వీక్షించగా.. 64వేల మంది టీజర్ సూపర్ హిట్టన్ లైక్ చేశారు. మరోవైపు 4,625 కామెంట్స్ వచ్చాయి. బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ చర్చనీయాంశమవుతోందని కొందరు అభిమానులు చెప్పుకుంటున్నారు.

More News

నితిన్ రీమేక్‌.. మ‌రో బాలీవుడ్ న‌టి

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. : చిరంజీవి

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దల భేటీ ముగిసింది. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు.

మలయాళ రీమేక్‌లో డ‌బుల్ ఆర్

రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్ క‌లిసి చేస్తోన్న ట్రిపుల్ ఆర్ సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కులు డబుల్ ఆర్ సినిమాను కూడా చూడ‌బోతున్నార‌ట‌.

షకీల సినిమాకు సెన్సార్ నుండి క్లీన్ యు సట్టిఫికెట్ !

షకీల అంటే అశ్లీలతతో కూడిన సినిమాలే చేస్తుంది. కుటుంబ కథా చిత్రాలు చేయదనే విమర్శలున్నాయి.

అభిమానుల‌కు బాల‌కృష్ణ విజ్ఞ‌ప్తి

నంద‌మూరి బాల‌కృష్ణ 60వ పుట్టిన‌రోజు జూన్ 10. నంద‌మూరి అభిమానులు ఈ వేడుక‌ల‌ను ఓ పండుగ‌లా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.