బోయపాటి విలన్స్ ఒకే సినిమాలో..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయడంలో ఎంత సక్సెస్ అవుతాడో.. విలనిజాన్ని ఎలివేట్ చేయడంలోనూ అంతే సక్సెస్ అవుతాడు దర్శకుడు బోయపాటి శ్రీను. లెజెండ్, సరైనోడు చిత్రాల కోసం ఒకప్పటి హీరోలనే విలన్‌లుగా చూపి వారిద్దరి కెరీర్‌కి ఓ కొత్త మలుపు ఇచ్చాడాయన.
కట్ చేస్తే.. ఈ రెండు చిత్రాల్లోని ప్రతినాయకులు అయిన జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇప్పుడు ఒకే చిత్రం కోసం కలిసి నటిస్తున్నారు. ఆ చిత్రమే సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం. ఈ చిత్రంలో కూడా వారిద్దరు నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నారా.. లేదంటే ముఖ్యమైన పాత్రల్లో దర్శనమిస్తున్నారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. రంగస్థలం డిసెంబర్‌లో గానీ, సంక్రాంతి కానుకగా గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com