ఇప్పుడే చెప్పమంటున్న బోయపాటి
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. కరోనా ప్రభావంతో షూటింగ్ ఆగింది. షూటింగ్‌ను ఆగస్ట్‌లో కానీ.. ఆ తర్వాత కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలోని రెండు విషయాలపై సోషల్ మీడియాలో రోజుకొక వార్త హల్ చల్ చేస్తుంది. అందులో ఒకటి సినిమా టైటిల్.. కాగా మరో విషయం బాలయ్యతో నటించబోయే హీరోయిన్. బాలయ్య సినిమా టైటిల్ మోనార్క్, సూపర్‌మేన్ అంటూ ఒకవైపు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య హీరోయిన్ గురించి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బోయపాటి క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్‌బీకే 106లో ఇద్దరు హీరోయిన్స్‌ను తీసుకున్నామని, అందులో ఒకరిని ఫైనల్ చేస్తామని అన్నారు. అలాగే టైటిల్ కూడా ఇప్పటికే ఓకే అయ్యిందని అయితే ప్రస్తుతం బయట పరిస్థితులు బాగోలేని కారణంగా మంచి టైమ్ చూసుకుని అటు టైటిల్.. ఇటు హీరోయిన్ ఎవరనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు బోయపాటి శ్రీను. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్‌గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com