ఇప్పుడే చెప్ప‌మంటున్న బోయ‌పాటి

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్ ఆగింది. షూటింగ్‌ను ఆగ‌స్ట్‌లో కానీ.. ఆ త‌ర్వాత కానీ ప్రారంభించే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమాలోని రెండు విష‌యాల‌పై సోష‌ల్ మీడియాలో రోజుకొక వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అందులో ఒక‌టి సినిమా టైటిల్‌.. కాగా మ‌రో విష‌యం బాల‌య్య‌తో న‌టించ‌బోయే హీరోయిన్‌. బాల‌య్య సినిమా టైటిల్ మోనార్క్‌, సూప‌ర్‌మేన్ అంటూ ఒక‌వైపు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బాల‌య్య హీరోయిన్ గురించి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి.

అయితే సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై బోయ‌పాటి క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్‌బీకే 106లో ఇద్ద‌రు హీరోయిన్స్‌ను తీసుకున్నామ‌ని, అందులో ఒక‌రిని ఫైన‌ల్ చేస్తామ‌ని అన్నారు. అలాగే టైటిల్ కూడా ఇప్ప‌టికే ఓకే అయ్యింద‌ని అయితే ప్ర‌స్తుతం బ‌య‌ట ప‌రిస్థితులు బాగోలేని కార‌ణంగా మంచి టైమ్ చూసుకుని అటు టైటిల్‌.. ఇటు హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు బోయ‌పాటి శ్రీను. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రీసెంట్‌గా బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

More News

‘పుష్ప’ కోసం భారీ ప్లాన్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ‘పుష్ప’.

మరో సినిమాకు రజినీ సైన్... వచ్చే ఏడాది కూడా పార్టీ లేనట్టేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం వచ్చే ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు.

ప్రభాస్ అభిమానులకు దూరమవుతున్నాడా?

హీరోల్లో ప్రభాస్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయనను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు.

నిమ్స్‌లో జరగాల్సిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. క్లినికల్ ట్రయల్స్‌ను దేశ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది.

ఆ డిజాస్టర్ హీరోయిన్‌ను సరికొత్తగా మార్చిన వర్మ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాలకు పైసా ఖర్చు లేకుండా ప్రతి గడపకూ తన సినిమాను చేర్చగల దిట్ట.