బోయ‌పాటి వెన‌క‌డుగు..!!

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా కాగా.. మ‌రో పాత్ర రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌బోతుంది. అయితే బాల‌య్య‌ను బోయపాటి అఘోరా పాత్ర‌లో చూపిస్తార‌నే వార్త‌లు రావ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ట‌. ఈ విష‌యం బోయపాటి శ్రీను వ‌ర‌కు చేర‌డంతో ఆయ‌న అఘోరా పాత్ర‌ను వీలైనంత త‌క్కువ‌గా క‌న‌ప‌డేలా స్క్రిప్ట్‌ను మారుస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క‌రోనా క్వారంటైన్ టైమ్‌లో సినిమా స్క్రిప్ట్‌కు మ‌రింత‌గా మెరుగులు దిద్దుతున్నాడ‌ట బోయపాటి. ఈ చిత్రంలో భూమిక లేడీ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

More News

సూర్య కమిట్‌మెంటే వేర‌ప్పా!!

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

బ‌న్నీ త‌దుప‌రి సినిమా ఆ ద‌ర్శ‌కుడితోనేనా?

బ‌న్నీ త‌దుప‌రి సినిమాల‌ను భారీ ప్లాన్‌తోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పాన్ ఇండియా

ప‌వ‌న్‌తో ఇల్లీ బేబీ! ఓకే అయిన‌ట్లేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై

క‌రోనా వైర‌స్‌పై మ‌రో సినిమా ..

ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు సినిమాల‌ను నిర్మించ‌డం మ‌న మేక‌ర్స్‌కు అల‌వాటు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని పార‌దోల‌డానికి అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు.

జర్నలిస్టుల తొలగింపుపై ముంబై ప్రెస్ క్లబ్ తీవ్ర ఆగ్రహం

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించొద్దని.. వారి జీతాల్లో కోత తగదని సాక్షాత్తు ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారు. అయితే కొన్ని మీడియా సంస్థల