బాక్సింగే నా ప్రపంచం అంటున్న గురు...!

  • IndiaGlitz, [Wednesday,January 11 2017]

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం గురు. బాలీవుడ్ మూవీ సాలా ఖ‌దూస్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సుధ కొంగ‌ర తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న గురు చిత్రం టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో వెంకీ బాక్సింగే నా ప్రపంచం అంటున్నారు. అంతే కాకుండా....మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తా చెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి అని టీజర్‌లో వెంకీ చెప్పిన‌ డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించారు. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి...టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న గురు ఎలాంటి విజ‌యం సాధిస్తాడో చూడాలి..!

More News

బాస్ దెబ్బ కు బాక్సులు బద్దలవ్వాల్సిందే: దర్శక నిర్మాతల ట్వీట్లు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నంబర్150'

మోహన్ లాల్ కనుపాప ఆడియో 25న, మూవీ ఫిబ్రవరి 3న విడుదల..!

మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పం.

కసి, పట్టుదల ఉంటే ఏం చేయచ్చు అనేది చిరంజీవి గారు ఖైదీ నెం 150 లో చూపించారు - వినాయక్

ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, నాయక్....ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్.

దత్తత గ్రామం చెరుపల్లిని నగదు రహితం చేయనున్న హీరో..!

భద్రాచలం సమీపంలోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పది ఏళ్లలో

'వైశాఖం' అందరికీ ఓ రెఫరెన్స్ మూవీ అవుతుంది - డైరెక్టర్ జయ.బి

జర్నలిస్ట్గా, రచయితగా, డైరెక్టర్గా తనకంటూ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్జయ.బి, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ వంటి సూపర్హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు.