పవన్.. చంద్రబాబు బినామీ.. ఎవర్నీ వదిలిపెట్టం!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ అని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ బినామీ గనుకనే టీడీపీ గొంతుకను వినిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగబోదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని.. అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాజధాని ఫలానా చోటికి తరలిపోతుందనే వార్తల నేపథ్యంలో బొత్సా స్పందిస్తూ.. ‘దొనకొండ’ అనేది ఎక్కుడుందో తనకు తెలియదని అన్నారు.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
‘రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం. వైఎస్ జగన్ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడ్డాయి. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తనంతట తానే వెనక్కి వెళ్లలేదని... రుణం వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించడంతోనే తప్పుకుంది. అమరావతికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగబోదు. సంక్షేమ పథకాలకు సాయం చేసేందుకు వరల్డ్ బ్యాంక్ ఇప్పటికీ సిద్ధంగా ఉంది. విశాఖ భూకుంభకోణంలో ఏ పార్టీవారు ఉన్నా వదిలిపెట్టబోమని... కఠిన చర్యలు తప్పవు’ అని మంత్రి హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout