Botsa:వైవీ వ్యాఖ్యలను ఖండించిన బొత్స.. ఉమ్మడి రాజధాని అంశంపై వైసీపీ యూటర్న్..

  • IndiaGlitz, [Wednesday,February 14 2024]

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. పదేళ్ల తరువాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని తెలిపారు. అర్థరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. అందుకే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

అలాగే తెలంగాణ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఏమైనా ఆయన సొంత ఆస్తినా.? బీఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. హైదరాబాద్‌ లాంటి నగరంలో ఎవరికైనా ఆస్తులు ఉండవచ్చని.. తనకు అక్కడ ఇల్లు ఉందన్నారు. తాను ఏపీలో మంత్రిని అయ్యానని.. తన ఇల్లును ఏమైనా కబ్జా చేస్తారా..? అని నిలదీశారు. రాజధాని అంశంపై లబ్ధి పొందాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన ఆస్తుల గురించి.. ఆ సమస్యల పరిష్కారం గురించే వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు.

కాగా రెండు రోజుల క్రితం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని.. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. జూన్‎తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడగించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పుకొచ్చారు. దీంతో వైవీ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

వైవీ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ను ఏపీకు రాజధానిగా కొనసాగించాలనే వైసీపీ నేతల డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ నాయకుల నుంచి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడబోమని.. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైసీపీ నేతల స్వార్థ పూరిత రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

More News

CM Revanth Reddy:చచ్చిన కేసీఆర్ పామును ఎవరైనా చంపుతారా..? సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మరోసారి వాడివేడి వాదనలు సాగాయి. ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా

Revanth Reddy: జల జగడం.. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్..

మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే అసెంబ్లీ వచ్చి ప్రాజెక్టులపై చర్చించాలని సవాల్ విసిరారు. పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా నల్గొండకు

KCR: కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు.. ప్రభుత్వంపై గులాబీ బాస్ ఫైర్..

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించింది.

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం.. నదిలో దొరికిన డైరెక్టర్ మృతదేహం..

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి అకాల మరణం చెందారు. సట్లెజ్ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో

దేశ ప్రజలకు మోదీ శుభవార్త.. ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్..

ఎన్నికల వేళ దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభవార్త అందించారు. కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.