ఇద్దరం ఒకే వేదిక పైన అవార్డులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది - జయసుధ
Send us your feedback to audioarticles@vaarta.com
విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైన్‌మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏటా లాగే ఈఏడాది కూడా సినిమా అవార్డులు అందించారు. అలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులకు టెక్నీషియన్లను ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు ఇప్పుడు గత రెండు ఏళ్ళగా నుంచి వెండి తెర అవార్డులను కూడా అందించడం విశేషం. ఈ సంవత్సరం ఇద్దరు సీనియర్ అలనాటి హీరోయిన్లకు ప్రధాన్యతనిస్తూ ఒకరికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, మరొకరికి లెజండరీ అవార్డును అందించారు. ఈ కార్యక్రమాన్ని శిల్పకళావేదికలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో...
సంస్థ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ... ‘‘ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గత రెండేళ్ళగా వెండితెర అవార్డులను అందిస్తున్నాను. నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నాకు తోడుగా ఉన్నారు కాబట్టే నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను..’’ అని అన్నారు. అలాగే ఈ సంవత్సరం లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అమ్మ జమునగారికి, లెజండరీ అవార్డును జయసుధగారికి అందిస్తున్నాం. ఇంకా మరిన్ని అవార్డులు కూడా ఇక్కడ అందిస్తున్నాము. నా మాట మీద గౌరవంతో ఇక్కడకు విచ్చేసిన మహామహులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
జమున మాట్లాడుతూ... మా విష్ణుగారు నన్ను ప్రత్యేకించి గౌరవించి నాకు ఈ అవార్డును ఇస్తున్నందుకు ఆయనకు ముందుకు నా థ్యాంక్స్. నా కూతురు జయసుధకి పండంటికాపురం చిత్రంలో పన్నెండేళ్ళ పిల్ల నా కూతురుగా అందులో నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెకు నా హృదయపూర్వక ఆశీస్సులు. గిరిబాబుగారు నా పక్కన ఎన్నో చిత్రాల్లో నటించారు. విలన్‌గా, కొడుకులా, హీరోలా ఇలా ఎన్నో పాత్రల్లో చేశారు. బాబుమోహన్ మంచి హాస్యనాటుడే కాదు ఆయన చాలా మంచి దిట్టమైన రాజకీయనాయకుడు కూడా విష్ణుగారి ఆధ్వర్యంలో నాకు ఈ లైఫ్‌టైమ్ ఎజీవ్‌మెంట్ అవార్డు రావడం ఎంతగానో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు అని అన్నారు.
జయసుధ మాట్లాడుతూ... వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా ఆ దేవుడికి నా కృతజ్ఞతలు. పన్నెండేళ్ళ వయసులో పండింటి కాపురం చిత్రంలో నేను జమునమ్మకు కూతురుగా నటించాను. మళ్ళీ తిరిగి నలభై ఏళ్ళ తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకుకోవడం చాలా గర్వంగా ఉంది. అంటే ఎంత మంచి అవకాశం ఇంత మంచి అవకాశం కల్పించింది దేవుడే కదా అందుకే దేవుడికి నా థ్యాంక్స్ అన్నారు. నేను ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తూ చాలా మంది దగ్గర డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సీనియర్ ఆర్టిస్టుల దగ్గర చాలా నేర్చుకున్నాను. ముందుగా అమ్మ దగ్గర డిసిప్లైన్ నేర్చుకున్నాను. ఈ అవార్డులు మాకు ఒక రివార్డుల్లాగా మమ్మల్ని గౌరవించడం చాలా అద్భ/తంగా ఉంది. నరేష్ కాల్ చేసి నాకు విబిఎంటర్ టైన్మెంట్స్ గురించి తెలిపారు. నాకు ఈ అవార్డుని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.
బాబుమోహన్ మాట్లాడుతూ... నాకు ఆల్‌రౌండర్‌గా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. విబి ఎంటర్ టైన్మెంట్స్ విష్ణుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మజమునగారు, అమ్మగారి కూతురు జయసుధగారు వారి చేతుల మీదుగా అవార్డును తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్టీఆర్‌గారి అభిమానిని. ఇద్దరి మేడమ్‌ల పక్కన నేను పానకంలో పుడక. ఇంతటి అద్భుతమైన నటుల మధ్య తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ... విబి ఎంటర్‌టైన్మెంట్స్ విష్ణుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నాకు బెస్ట్ డైలాగ్ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఆర్టిస్టుల ముందు చిన్న ఆర్టిస్టునైన నాకు అవార్డు ఇచ్చినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
అవార్డులు వచ్చినవారు...
మా అసోసియేషన్ నరేష్ః సమ్మోహనం చిత్రానికి ఫ్యామిలీ మూవీ అవార్డు
ఇషారెబ్బా హీరోయిన్ః అరవింద సమేత చిత్రానికి బ్యూటీ ఆఫ్ ఆ ఇయర్ అవార్డు
చక్రిః బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ మహేష్ మహర్షి చిత్రానికి
జానీమాస్టర్ కొరియోగ్రాఫర్ః జిల్‌జిల్ జిగేల్ రాణి పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు
స్వరూప్ః బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు ఏజంట్ సాయిశ్రీనివాస్ చిత్రానికి
ఉత్తమ పాటల రచయితః శ్రీమణి మహర్షి చిత్రానికి
బెస్ట్ ఫ్రష్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ః అనన్య మల్లేశం చిత్రానికి
బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డుః కారుణ్య చౌదరి
బెస్ట్ కమిడియన్ః రఘుబాబు ఎఫ్2 మూవీ
ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్, యమున, గిరిబాబు, కియారాఅద్వాని అంబికకృష్ణ, సి.కళ్యాణ్, రామ్‌సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout