శ్రియకి రెండు అలాంటివే
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో వశిష్టీదేవిగా మెప్పించింది అందాల నటి శ్రియ. అయితే అదే బాలకృష్ణ కొత్త చిత్రం 'పైసా వసూల్'తో నిరాశపరిచింది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రియ రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ఒకటి తెలుగులో రూపొందుతున్న 'వీరభోగ వసంతరాయలు' కాగా.. మరొకటి తమిళంలో తెరకెక్కుతున్న 'నరగాసురన్'. ఈ రెండు చిత్రాలు కూడా మల్టీ ఆర్టిస్ట్‌లతో రూపొందుతున్నవే కావడం విశేషం.
సుధీర్‌బాబు, నారా రోహిత్, శ్రియ కాంబినేషన్లో వస్తున్న 'వీరభోగ వసంతరాయలు'లో హీరో, హీరోయిన్, విలన్ అనే కేటగిరి లేకుండా ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటే.. అరవింద్‌స్వామి, శ్రియ, ఇంద్రజిత్, సందీప్ కిషన్ కాంబినేషన్లో వస్తున్న 'నరగాసురన్'లో కూడా ఇదే పరిస్థితి. సో.. శ్రియ ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలూ ఒకే శైలిలో తెరకెక్కుతున్నాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com