ఎస్.. పవన్ కల్యాణ్ నిజంగా ‘నాయుడే’!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై గత కొన్ని రోజులు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరేమో పవన్ నాయుడు అని ఇంకొందరు చంద్రబాబు దత్తపుత్రుడు అని మరికొందరేమో నారా పింక్ కల్యాణ్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి మీడియా ముందు హడావుడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. అయితే ఈ విమర్శలు, పేర్లు గురించి పవన్ కల్యాణ్ ఇంతవరకూ ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు.

నిజంగా నాయుడే..!
‘పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు దత్తపుత్రుడని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.. మరి మీరేంటి..? మీరు జగన్‌ మోహన్‌రెడ్డి పెంపుడు కుక్కలా..?. పవన్‌ కల్యాణ్‌ పేరెత్తే అర్హత, స్థాయి మీకుందా..?. పెంపుడు కుక్కల్లాగా, పెయిడ్ ఆర్టిస్టుల లాగా ప్రెస్‌మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకడు పవన్ నాయుడని అంటున్నాడు. నిజంగా.. మీసం మీద చెయ్యేసి చెబుతున్నానా.. పవన్‌ నాయుడేనని, పవన్ పాలకొల్లు నాయుడు. మీ గురించి మీకు (వైసీపీ ఎమ్మెల్యేలు) డౌట్‌గా ఉంటే మీ డీఎన్‌ఏలు చెక్‌ చేయించుకోండి’ అని పవన్ కల్యాణ్‌కు మద్దతుగా బోండా ఉమా మాట్లాడారు.

కొవ్వు కరుగుతుంది!
ఈ సందర్భంగా మూడు రాజధానుల గురించి మాట్లాడిన ఆయన.. రాజధానులు పెట్టడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు? అని వైసీపీ ప్రభుత్వానికి సూటి ప్రశ్న సంధించారు. అమరావతి ప్రాంతంలో దాక్కుని తిరుగుతున్న ఎమ్మెల్యేలు.. భవిష్యత్‌లో సీఆర్‌డీఏ పరిధిలో కనిపించరని ఆయన జోస్యం చెప్పారు. కొవ్వు తలకెక్కిన వైసీపీ నేతలకు కొవ్వు కరిగే రోజులు త్వరలో వస్తాయని కామెంట్ చేశారు.