శ్రీ సుశీల విడుదల చేసిన బొమ్మల రామారం పాటలు
Send us your feedback to audioarticles@vaarta.com
అందరు నూతన నటీనటులను పరిచయం చేస్తూ నిషాంత్ దర్శకత్వంలో పుధారి అరుణ నిర్మిస్తోన్న చిత్రం 'బొమ్మల రామారం'. కార్తిక్ కొడకండ్ల, శ్రవణ్ మైకేల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను ప్రముఖ గాయని శ్రీ సుశీల గారు ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా
శ్రీ సుశీల భరద్వాజ్ మాట్లాడుతూ.. పాటలు వినసొంపుగా ఉన్నాయి. అందరు కొత్త నటీనటులతో దర్శకుడు నిషాంత్ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకు రావాలని ఆకాంక్షించారు...
దర్శకుడు నిషాంత్ మాట్లాడుతూ.. ''సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీం ఎఫర్ట్ తో చేసిన సినిమా ఇది. పాటలు ఈ సినిమాకు ప్రదానమైన ఎసెట్ గా నిలుస్తాయి. ప్రేక్షకులు మా సినిమాను చూసి బాగుంటెనె మరొ పదిమంది చూసెలా ప్రమోట్ చెయాల్సిందిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాత అరుణ మాట్లాడుతూ.. ''ఓ కుటుంబంలాగా అందరం కష్టపడి పని చేశాం. సుశీల గారు మా సినిమా పాటలను విడుదల చేయటం ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
సూరి,మోహన్ భగత్, రూపా రెడ్డి, సంకీర్తన, తిరువీర్, ప్రియ దర్శిని, విమల్, జ్యోతి వర్మ, జగన్, గుణకర్,అభయ్, శివ,కేశవ్, మోహన్ భగత్, కేశవ్ దీపక్, హారిక,స్వాతి, సంద్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: బి.వి.అమర్ నాథ్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్స్: కార్తిక్ కొడకండ్ల, శ్రవణ్ మైకేల్, ఎడిటర్: శివ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, నిర్మాత: పుధారి అరుణ, రచన-దర్శకత్వం: నిషాంత్ పుధారి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments