ఎకోఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో 'బొమ్మలరామారం'

  • IndiaGlitz, [Friday,August 05 2016]

సినిమా ప్రమోషన్స్ లో కొత్త విధానానికి ఇప్పుడు నిర్మాతలు శ్రీకారం చుడుతున్నారు. అందులోభాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్రమోషన్స్ ను చేస్తున్నారు. అందులోభాగంగా మూడు చక్రాల సైకిల్ పై తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే ఈ విధానం.
ఈ విధానంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బొమ్మలరామారం చిత్రయూనిట్. మేడియవాల్‌ స్టోరీ టెల్లర్స్‌ సమర్పణలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం బొమ్మల రామారం'. నిషాంత్‌ దర్శకత్వంలో పుదారి అరుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌వుతుంది. ఇందులో ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీతో పాటు చెడుపై మంచి ఎప్ప‌టికైనా విజ‌యాన్ని సాధిస్తుంద‌నే చ‌క్క‌టి మెసేజ్ ఈ చిత్రంలో చెప్పామని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఈ సినిమా ద్వారా 50 న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు,ఈ సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్ళడానికి యూనిట్ చేసే ప్రయత్నాలు చాలా కొత్తగా ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ తిరువీర్‌, సంకీర్తన, ప్రియదర్శి, విమల్‌ కృష్ణ, మోహన్‌ భగత్‌, గుణకర్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

More News

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల- దిల్ రాజు చిత్రం షూటింగ్ రేపు ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,దర్శకుడు శేఖర్ కమ్ముల,నిర్మాత దిల్ రాజు కలయికలో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం రూపొందనుంది.

హాట్ టాపిక్ గా మారిన రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో..!

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈనెల‌ 12 న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సరసన స‌మంత‌, నిత్యా మీనన్ లు కథానాయికలు గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మల‌యాళ నటుడు మోహన్ లాల్  ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

నిఖిల్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందట...!

ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న నిఖిల్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..?కలర్స్ స్వాతి.