ఆగస్ట్ 12న విడుదలవుతున్న'బొమ్మల రామారం'
Send us your feedback to audioarticles@vaarta.com
మేడియవాల్ స్టోరీ టెల్లర్స్ సమర్పణలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బొమ్మల రామారం'. నిషాంత్ దర్శకత్వంలో పుదారి అరుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత పుదారి అరుణ మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్నవాడికి లేనివాడికి మధ్య ఓ అంతరం, పోరాటం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఓ గ్రామ నేపథ్యంలో చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ బొమ్మల రామారం. దర్శకుడు నిషాంత్ సినిమాను ఆద్యంతం ఆసక్తిగా తెరకెక్కించారు. ఇందులో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చెడుపై మంచి ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తుందనే చక్కటి మెసేజ్ కూడా చెప్పాం.
అంతే కాకుండా ఈ సినిమాలో ఉన్న మొసలి ఫైట్ సినిమాకు చాలా హైలైట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా 50 నటీనటులు, టెక్నిషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కమర్షియల్ సినిమాల స్టయిల్‌లో ఉండే మంచి సందేశాత్మక చిత్రమిది. నటీనటులు, టెక్నికల్ టీం ఎఫర్ట్ బావుంది. సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలవుతుంది`` అన్నారు.
తిరువీర్, సంకీర్తన, ప్రియదర్శి, విమల్ కృష్ణ, మోహన్ భగత్, గుణకర్, శివ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: సుధీర్‌కుమార్, ఆర్ట్: కృష్ణ మాయ, ఎడిటర్: శివ శ్రీనివాస్, మ్యూజిక్: కార్తీక్ కొడకండ్ల, శ్రవణ్ మైకేల్, సినిమాటోగ్రఫీ: బి.వి.అమర్‌నాథ్ రెడ్డి, నిర్మాత: పుదారి అరుణ, రచన, దర్శకత్వం: నిషాంత్ పుదారి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments