'బొమ్మ బ్లాక్ బస్టర్' చిత్రం టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ శ్రీకృష్ణ(నందు), డస్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ కలయికలో తెరకెక్కిన చిత్రం "బొమ్మ బ్లాక్ బస్టర్. టైటిల్ తోనే అటు ఆడియెన్స్ లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన తెచ్చుకుంది ఈ సినిమా. ఇక ఆ తరువాత విడుదలైన నందు ఫస్ట్ లుక్ తో పాటు, రష్మీ గౌతమ్ లుక్స్ కి సైతం ఫుల్ క్రేజ్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం బృందం తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.
ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని, నందు పాత్రకు ధీటుగా రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలవ్వనుంది.
నటీనటులు: నందు ఆనంద్ కృష్ణ, రష్మీ గౌతమ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments