కంగనా ఆఫీస్ కూల్చివేత కేసుపై హైకోర్టు తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
బాంద్రాలోని కంగనా రనౌత్ ఆఫీసును బీఎంసీ(బ్రిహాన్ ముంబై కార్పొరేషన్) అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇలా కూల్చివేయడాన్ని తప్పబడుతూ కంగనా రనౌత్ ముంబై కోర్టులో కేసు వేసింది. నిబంధనల ప్రకారం ఉన్న ఆఫీసును విరుద్ధంగా ఎలా కూల్చివేశారంటూ కోర్టు అధికారుల తీరుని తప్పు పట్టింది. కంగనాకు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా విజయం సాధించిందని అంటున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అప్పట్లో సెన్సేషల్ కామెంట్స్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుని దయ్యబట్టింది. ముంబైని పీఓకేతో పోల్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కోపం వచ్చింది. బాంద్రాలోని ఆమె ఆఫీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ బీఎంసీ కూల్చివేతను ప్రారంభించింది. ఆ సమయంలో కంగనా కోర్టు మెట్లక్కడంతో హైకోర్టు కూల్చివేతపై స్టే విధించింది. కక్షతోనే ప్రభుత్వం తన ఆఫీసును కూల్చివేసిందని, తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ కంగనా కేసు వేసింది. కేసును విచారించిన కోర్టు కంగనాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout