‘వి’ చిత్రాన్ని తొలగించండి: బాంబే హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ మూవీ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన దాదాపు 6 నెలలకు ఈ సినిమాపై వివాదం చెలరేగింది. ‘వి’ చిత్రాన్ని తొలగించాలని బాంబే హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నటి, మోడల్ సాక్షి మాలిక్ ఈ సినిమాపై బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా ఆ సినిమాలో తన ఫొటోను వినియోగించారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
ఇన్స్టాగ్రామ్ నుంచి తన ఫొటోను తీసుకుని, ఆ చిత్రంలో ఓ కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా పేర్కొంటూ తన ఫొటోను పలుమార్లు చూపించారని సాక్షి పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఇది ముమ్మాటికీ పరువు నష్టం కలిగించే అంశమేనని వ్యాఖ్యానించింది. పిటిషనర్ ఫొటోను బ్లర్ చేయడమో, పిక్సల్స్ పెట్టడమో చేయకూడదని.. పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో అమెజాన్ నుంచి ఆ సినిమాను తీసివేయాలని సూచించింది. ఆ సన్నివేశాల్లో మార్పులు చేసే వరకూ ఇతర ప్లాట్‌ఫారాల్లో, థియేటర్లలోనూ.. ‘వి’ సినిమాను ప్రదర్శించొద్దని పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout