'బొంబాట్‌' రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ 'స్వామినాథ‌' విడుద‌ల

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై 'ఈన‌గ‌రానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం 'బొంబాట్'. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

‘‘బుద్ధిగా కలగన్నాబుజ్జిగా ఎదపైన
సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరా
అన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన ...
స్వామినాథ’’

అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా జోష్‌.బి సంగీతం అందించారు. చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిణి ఇవటూరి పాటను ఆలపించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

‘త‌లైవి’ కోసం భారీ ప్రైజ్‌

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం `త‌లైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఒకే సినిమా.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్‌2 చిత్రాల‌తో వ‌రుస హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో క‌లిసి బాక్సింగ్ నేప‌థ్యంలో

డిజిట‌ల్ కోసం చేతులు క‌లుపుతున్న నిర్మాత‌లు

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినీ పెద్ద‌లు షూటింగ్స్‌ను స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు.

క్రిష్ మాటలను పవన్ వింటాడా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు. తొలి చిత్రంగా పింక్ రీమేక్‌గా వ‌కీల్‌సాబ్‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

హర్భజన్ సింగ్ హీరోగా 'ఫ్రెండ్ షిప్' మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ  క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం