‘పుష్ప’లో బాలీవుడ్ విలన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్ 'బాహుబలి' రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో బిజి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని అటవీ ప్రాంతం మారేడు మిల్లిలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్యాన్ ఇండియా యాక్టర్స్‌ను ఎంపిక చేస్తున్నారట సుకుమార్. తమిళం నుండి బాబీ సింహ, కన్నడ నుండి దర్శన్, తెలుగు నుండి దర్శన్ నటిస్తున్నారు. మరి ప్యాన్ ఇండియా అంటున్నారు... బాలీవుడ్ స్టార్స్ లేరా? అంటే.. ఇప్పుడు సుకుమార్ అండ్ టీమ్ బాలీ డియోల్‌ను మెయిన్ విలన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్రధాన కథాంశం రన్ అవుతుంది. ఇందులో బన్నీ పాత్రను.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి తర్వాత లారీ డ్రైవర్‌గా మారి, తర్వాత పెద్ద స్మగ్లర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడనేలా సుక్కు తీర్చిదిద్దారట. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments