ప్రధాని నివాసంలో బాలీ,టాలీవుడ్ ప్రముఖులు.. ఎందుకంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్ర మోదీని బాలీవుడ్ ప్రముఖుులు కలిశారు. శనివారం నాడు ప్రధాని నివాసానికి విచ్చేసిన సినీ తారలు, నిర్మాతలు మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించడంపై చర్చలు జరిపారు. ఈ సినీ తారల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. అంతేకాదు టాలీవుడ్‌కు చెందిన నిర్మాతలు ఉన్నారు. వీరిలో తెలుగువారైన ఎస్పీ బాలసుబ్రమణ్యం, చెరకూరి కిరణ్, దిల్‌రాజులకు ఆహ్వానం అందగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ఇదే సమయంలో 2022లో ఇండియా జరుపుకునే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపైనా నిశితంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ‘గాంధీ ఎట్ 150’ వీడియోలను మోదీ విడుదల చేశారు.
సాయం చేయం.. సహకరించండి!
మోదీని కలిసిన బాలీవుడ్ నటుల్లో షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, ఇంతియాజ్ అలీ, బోనీ కపూర్, ఆనంద్ ఎల్ రాయ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. టీవీ, సినీ పరిశ్రమ ప్రముఖులు దేశాభివృద్ధిపై స్ఫూర్తిదాయక కథనాలపై దృష్టిని సారించాలని.. ఇందుకోసం ప్రభుత్వ పరంగానూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండియాలో పర్యాటకరంగ అభివృద్ధికీ బాలీవుడ్ తారలు సహాయం చేయాలని మోదీ కోరారు. ఈ సందర్భంగా.. షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com