ప్రధాని నివాసంలో బాలీ,టాలీవుడ్ ప్రముఖులు.. ఎందుకంటే..

  • IndiaGlitz, [Sunday,October 20 2019]

భారత ప్రధాని నరేంద్ర మోదీని బాలీవుడ్ ప్రముఖుులు కలిశారు. శనివారం నాడు ప్రధాని నివాసానికి విచ్చేసిన సినీ తారలు, నిర్మాతలు మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించడంపై చర్చలు జరిపారు. ఈ సినీ తారల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. అంతేకాదు టాలీవుడ్‌కు చెందిన నిర్మాతలు ఉన్నారు. వీరిలో తెలుగువారైన ఎస్పీ బాలసుబ్రమణ్యం, చెరకూరి కిరణ్, దిల్‌రాజులకు ఆహ్వానం అందగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ఇదే సమయంలో 2022లో ఇండియా జరుపుకునే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపైనా నిశితంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ‘గాంధీ ఎట్ 150’ వీడియోలను మోదీ విడుదల చేశారు.

సాయం చేయం.. సహకరించండి!

మోదీని కలిసిన బాలీవుడ్ నటుల్లో షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌, ఇంతియాజ్ అలీ, బోనీ కపూర్, ఆనంద్ ఎల్ రాయ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. టీవీ, సినీ పరిశ్రమ ప్రముఖులు దేశాభివృద్ధిపై స్ఫూర్తిదాయక కథనాలపై దృష్టిని సారించాలని.. ఇందుకోసం ప్రభుత్వ పరంగానూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండియాలో పర్యాటకరంగ అభివృద్ధికీ బాలీవుడ్ తారలు సహాయం చేయాలని మోదీ కోరారు. ఈ సందర్భంగా.. షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

More News

ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయాను: పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన మహేశ్‌, తారక్‌, అల్లుఅర్జున్‌లతో కలసి నటించి స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుందరాంగి పూజా హెగ్డే.

రచయితల సంఘం రజతోత్సవ వేడుక టీజర్‌ ఆవిష్కరణ

'నాన్నగారు ఓ మాట చెప్పేవారు. లక్ష్మీ ఎదురువస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి నమస్కరించు.

అభిమానికి సూపర్ స్టార్ స్వీట్‌ వార్నింగ్‌

రజనీకాంత్‌ ఓ అభిమానికి సుతిమెత్తటి వార్నింగ్‌ను ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే..

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' బావుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు! - సాయికిరణ్ అడివి

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా నటించిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'

'కంత్రీరాజా' నవంబర్ రెండో వారంలో విడుదల

నవతరం రీల్స్ పతాకం పై తనీష్ హీరోగా నాగేష్ నారదాసి దర్శకత్వంలో మధు బాబు వెల్లూర్ నిర్మాతగా, నిర్మాణంలో వున్నా చిత్రం "కంత్రీరాజా".