బాలీవుడ్ టు హాలీవుడ్...
Send us your feedback to audioarticles@vaarta.com
హాలీవుడ్ చిత్రాల్లోని సన్నివేశాలను టెక్నాలజీని మన సినిమావాళ్లు ఫాలో అవుతుంటారు. కానీ తొలిసారి హాలీవుడ్ సంస్థ, బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయనుంది. ఇంతకు ఆ సినిమా మరేదో కాదు, హృతిక్, యామీ గౌతమ్ నటించిన చిత్రం `కాబిల్`. ఈ విషయాన్ని `కాబిల్` చిత్ర దర్శకుడు సంజయ్ గుప్తా తెలియజేశారు.
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుంది. హృతిక్ ఇప్పుడు పారిన్ టూర్లో ఉన్నాడు. తను ఇండియాకు రాగానే విషయాన్ని తెలియజేస్తారట. ఈ చిత్రంలో హృతిక్, యామీ ఇద్దరూ అంధులుగా నటించారు. ఓ అంధుడు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తెలివిగా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే కథ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments