బాలీవుడ్ టు హాలీవుడ్‌

  • IndiaGlitz, [Monday,April 16 2018]

సినిమాల కంటే వివాదాల్లో ఎక్కువ ఉండే హీరోయిన్ రాధికా ఆప్టే. ఈ అమ్ముడు తెలుగులో ర‌క్త‌చ‌రిత్ర‌, లెజెండ్‌, ల‌య‌న్ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. త‌ర్వ‌లోనే రాధికా ఆప్టే హాలీవుడ్‌లోకి ఎంట్రీ కానుంది. గ‌తంలో ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా వంటి నటీవుణులు బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేశారు.

ఇప్పుడు వీరి బాటలోకి అడుగు పెడుతుంది రాధికా అప్టే.  ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లిడియా డీన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో స్టానా కాటిక్, సారా మేగాన్ లాంటి హాలీవుడ్ తారలు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇందులో రాధిక బ్రిటీష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా క‌నిపించ‌నుంది.