'ల‌వ‌ర్' కోసం బాలీవుడ్ టెక్నీషియ‌న్

  • IndiaGlitz, [Tuesday,June 12 2018]

‘ఉయ్యాలా జంపాలా’, ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. కాని గ‌త‌ కొద్ది కాలంగా రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'రంగులరాట్నం' గాని, శుక్రవారం విడుదలైన 'రాజుగాడు' గాని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాగా.. దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న 'లవర్' ఆగష్టులో విడుద‌ల కానుంది.

ఈ సినిమాకు 'అలా ఎలా' ఫేమ్ అనీశ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు న‌లుగురు ప‌నిచేయ‌డం విశేషం. అంకిత్ తివారి రెండు పాట‌లు, ఆర్కో ముఖర్జీ ఒక పాట‌, త‌న్షీక్ బాగ్చి ఒక పాట‌, రిషీ రిచ్ ఒక పాట‌ను చేశార‌ట‌. ఈ సినిమాతో అయినా స‌క్సెస్ అందుకుంటాన‌ని రాజ్‌త‌రుణ్ పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.