ఇట్స్ అఫిషీయల్ : ఫిబ్రవరిలో ‘‘గాడ్‌ఫాదర్’’ షూటింగ్లో పాల్గొననున్న సల్మాన్ ఖాన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. వరుసపెట్టి పాన్ ఇండియా స్థాయి సినిమాలతో ఇప్పుడు తెలుగు పరిశ్రమ జాతీయ స్థాయిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో హిందీ నటులు సైతం తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధాదాస్, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్, దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో బాలీవుడ్ సూపర్‌స్టార్ కూడా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఆయన ఎవరో కాదు సల్మాన్ ఖాన్.
మోహన రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘‘గాడ్ ఫాదర్’’లో సల్లూభాయ్ కీరోల్ పోషించనున్నారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘‘లూసీఫర్’’ రిమేక్గానే గాడ్‌ఫాదర్ తెరకెక్కిస్తున్నారు. పృథ్వీరాజ్ పోషించిన కీలకపాత్రను తెలుగులో సల్మాన్‌తో చేయించనున్నారు మేకర్స్. తొలుత ఈ పాత్ర కోసం రామ్‌చరణ్ పేరును పరిశీలించారు. తర్వాత అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా సల్మాన్ ఈ ఛాన్స్‌ను దక్కించుకున్నారు.
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్.. ఈ క్యారెక్టర్ చేయడానికి ఓకే చెప్పినట్లు మీడియాకు వివరించారు. ఫిబ్రవరి నెలలో ‘‘గాడ్ ఫాదర్’’ యూనిట్‌తో సల్లూ భాయ్ కలవనున్నారని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించనున్నారు. గాడ్‌ఫాదర్‌తో పాటు చిరంజీవి.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్లో ‘‘వాల్తేర్ వీరయ్య’’తో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments