Sanjay Dutt:షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలి కాలంలో సినిమా షూటింగుల్లో పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రమాదాల బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న గాక మొన్న తమిళ స్టార్ హీరో విశాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా షూటింగ్లో గాయపడి కోలుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ షూటింగ్లో ప్రమాదం బారినపడ్డారు.
ధ్రువ్ సర్జా కేడీ సినిమాలో నటిస్తోన్న సంజయ్ దత్:
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కుతోన్న కేడీ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్నారు. హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టంట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో ఓ బాంబ్ బ్లాస్ట్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో సంజయ్ దత్ గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆయన ముఖం, చేయి, భుజానికి గాయాలైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ సంజయ్ దత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం సంజయ్ దత్ ముంబైకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
ప్రాజెక్ట్ షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ :
కాగా.. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ప్రాజెక్ట్ కే’’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా బిగ్ బీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పక్కటెముక మృదలాస్థి విరగడంతో పాటు కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ తన బ్లాగర్ ద్వారా వెల్లడించారు. దీంతో షూటింగ్ రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుని కోలుకున్నారు. ఈ క్రమంలో మార్చి 20న తన గాయం నయమైనట్లు అమితాబ్ వెల్లడించారు. తన కోసం ప్రార్ధించిన వారికి అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments