రజనీ నీకిదే నా వందనం అంటున్న బాలీవుడ్ స్టార్..

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్..రేంజ్ ఏమిటో..? ఆయ‌న‌కున్న క్రేజ్ ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందే. కానీ...ర‌జ‌నీ మాత్రం క్రేజు, రేంజు ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోరు. సాధార‌ణంగా ఉండ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. ఆరోగ్య కార‌ణాల వ‌ల‌న ర‌జ‌నీ అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అమెరికా నుంచి ఇండియా వ‌చ్చేందుకు ర‌జ‌నీ అమెరికా ఎయిర్ పోర్ట్ కు ఇలా సింపుల్ గా ఎలాంటి హ‌డావిడి లేకుండా వెళ్లారు. అంద‌రితో పాటే త‌నీఖీ నిమిత్తం క్యూలో నిలుచున్నారు. ఈ విష‌యాన్ని బాలీవుడ్ సీనియ‌ర్ హీరో రిషి క‌పూర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అంతే కాకుండా అమెరికా ఎయిర్ పోర్ట్ లో ర‌జ‌నీ ఉన్న ఫోటోను రిషి క‌పూర్ ట్విట్ చేసి...ర‌జ‌నీ సింప్లిసిటీకి ఇదే నిద‌ర్శ‌నం. మీ అణుకువ‌కు ఇదే నా వంద‌నం అని తెలియ‌చేసారు.ఏది ఏమైనా... ర‌జ‌నీ స్టైలే వేరు..!

More News

చుట్టాల‌బ్బాయి టీమ్ స‌మ‌క్షంలో జ‌రిగిన‌ సాయికుమార్ జ‌న్మ‌దిన వేడుక‌

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ ముఖ్య‌పాత్ర పోషించారు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్ తాల్లూరి, వెంక‌ట్ త‌లారి  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

'నీ జతలేక' ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక

నాగశౌర్య, పారుల్‌, సరయు హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'నీజతలేక'. స్వరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చిందని చిత్రయూనిట్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను నిర్వహించారు.

వైశాఖం యూనిట్ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన‌ హీరో హ‌రీష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వైశాఖం.

అభినేత్రి విడుదల తేదీ ఖరారు

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి.

75 రోజులు పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు'

బిచ్చగాడు సినిమా దండయాత్ర కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు 75 రోజులు కూడా దాటింది. 75 రోజులంటే ఐదో పదో థియేటర్లలో కాదు.. మొత్తం 200 థియేటర్లలో.. అవును.. ఏ స్టార్‌కీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది బిచ్చగాడు.