రజనీ నీకిదే నా వందనం అంటున్న బాలీవుడ్ స్టార్..

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్..రేంజ్ ఏమిటో..? ఆయ‌న‌కున్న క్రేజ్ ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందే. కానీ...ర‌జ‌నీ మాత్రం క్రేజు, రేంజు ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోరు. సాధార‌ణంగా ఉండ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. ఆరోగ్య కార‌ణాల వ‌ల‌న ర‌జ‌నీ అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అమెరికా నుంచి ఇండియా వ‌చ్చేందుకు ర‌జ‌నీ అమెరికా ఎయిర్ పోర్ట్ కు ఇలా సింపుల్ గా ఎలాంటి హ‌డావిడి లేకుండా వెళ్లారు. అంద‌రితో పాటే త‌నీఖీ నిమిత్తం క్యూలో నిలుచున్నారు. ఈ విష‌యాన్ని బాలీవుడ్ సీనియ‌ర్ హీరో రిషి క‌పూర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అంతే కాకుండా అమెరికా ఎయిర్ పోర్ట్ లో ర‌జ‌నీ ఉన్న ఫోటోను రిషి క‌పూర్ ట్విట్ చేసి...ర‌జ‌నీ సింప్లిసిటీకి ఇదే నిద‌ర్శ‌నం. మీ అణుకువ‌కు ఇదే నా వంద‌నం అని తెలియ‌చేసారు.ఏది ఏమైనా... ర‌జ‌నీ స్టైలే వేరు..!