ఎన్టీఆర్ ను మెచ్చుకున్న బాలీవుడ్ స్టార్..

  • IndiaGlitz, [Friday,January 08 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఇర‌గ‌దీస్తాడ‌నే సంగ‌తి తెలిసిందే. ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ సెల‌బ్రిటీలు కూడా ఇప్పుడు యంగ్ టైగ‌ర్ పై త‌మ ఇష్టాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఖుష్బూ త‌న‌కు ఎన్టీఆర్ న‌ట‌న అంటే చాలా ఇష్ట‌మైని త‌న సినిమాల‌ను వ‌ద‌ల‌కుండా చూస్తాన‌ని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హృతిక్ కూడా చేరాడ‌ట‌. ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఎల‌క్ట్రిఫైయింగ్ డ్యాన్సులంటే ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడ‌ట‌. ఇప్పుడు సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతున్న నాన్న‌కు ప్రేమ‌తో..' సినిమాలో ఎలాంటి స్టెప్స్ వేసి అద‌ర‌గొడ‌తాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.