రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ సినిమాలో బాలీవుడ్ స్టార్‌..?

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్.. ఎన్టీఆర్‌తో క‌లిసి ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా ట్రిపులార్ అక్టోబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ ప్యాన్ ఇండియా ఫార్ములాను కంటిన్యూ చేస్తూ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చేతులు క‌లిపాడు రామ్‌చ‌ర‌ణ్‌.

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను త‌న‌దైన శైలిలో బిగ్గ‌ర్‌దేన్ లైఫ్‌గా తెర‌కెక్కించే శంక‌ర్ అదే స్టైల్‌లో ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోను విల‌న్‌గా న‌టింప చేయ‌డానికి శంక‌ర్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. ర‌ణ్వీర్ సింగ్‌. బాలీవుడ్‌లో హీరోగానే కాదు, ప‌ద్మావ‌త్ సినిమాలో నెగ‌టివ్ షేడ్‌లో న‌టించిన ర‌ణ్వీర్ సింగ్‌ను త‌న సినిమాలో విల‌న్‌గా న‌టింప చేస్తే బావుంటుంద‌నేది శంక‌ర్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. మ‌రి శంక‌ర్ సినిమాలో న‌టించ‌డానికి ర‌ణ్వీర్ సింగ్ ఓకే అంటాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ ర‌ణ్వీర్ ఓకే అంటే మాత్రం సినిమా నెక్ట్స్ రేంజ్ మూవీగా అంచ‌నాల‌ను పెంచుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.

More News

క్లాసిక్ మూవీ అంటూ ‘ఉప్పెన’కు మ‌హేశ్ ప్ర‌శంస‌

ఉప్పెన టీమ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేసే ప‌నిలో ఉంది.  ఒక‌వైపు ప్రేక్ష‌కులే కాదు, సెల‌బ్రిటీలు సైతం సినిమాను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో మాస్‌  మహారాజ‌..!

మాస్ మ‌హారాజాకు క్రాక్ స‌క్సెస్ ఇచ్చిన కిక్‌తో మ‌రింత స్పీడు పెరిగింది. ‘క్రాక్’ సినిమా విడుద‌ల కాక‌ముందే ర‌మేశ్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో

‘క్షణ క్షణం’తో మెప్పిస్తానంటున్న హీరో ఉదయ్ శంకర్

నిజ జీవితంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన ఓ 15 ఏళ్ల బాలుడు.. తన స్కిల్‌ను మెరుగుపరుచుకోవడం కంటే ఎక్కువగా సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు.

రామ్ స‌ర‌స‌న ‘ఉప్పెన’ బ్యూటీ

తొలి చిత్రం ఉప్పెన‌తో శాండిల్‌వుడ్ బ్యూటీ కృతిశెట్టి తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.